గాజా: సుమారు 200 మంది బందీగా చేసినట్లు తాజాగా హమాస్(Hamas) ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. అయితే బందీల పట్ల మానవత్వంతో వ్యవహరిస్తున్నట్లు చెప్పేందుకు హమాస్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. 21 ఏళ్ల మియా స్కీమ్ అనే మహిళ చేతికి చికిత్స చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కొన్ని రోజుల క్రితం హమాస్ ఉగ్రవాదుల అక్రమ రీతిలో ఇజ్రాయిల్లోకి చొరబడి కొందర్ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ బందీల్లో 21 ఏళ్ల మియా ఒకరు. ఓ గుర్తు తెలియని మెడికల్ వర్కర్ ఆమెకు చికిత్స చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోపై ఐడీఎఫ్ కూడా ప్రకటన రిలీజ్ చేసింది.
తమకు తాము మానవత్వం చాటుతున్న అంశాన్ని చెప్పేందుకు హమాస్ ఆ వీడియోను రిలీజ్ చేసిందని, కానీ నిజానికి ఆ సంస్థ చాలా క్రూరమైందని ఐడీఎఫ్ తెలిపింది. శిశువులను, పిల్లలను, మహిళలను ఆ సంస్థ ఎత్తుకువెళ్తున్నట్లు ఆరోపించింది. మియాతో పాటు హమాస్ వద్ద ఉన్న బందీలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్కొన్నది. సూపర్ నోవా సుకోట్ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొంటున్న సమయంలో మియాను కిడ్నాప్ చేశారు.ఆ మ్యూజిక్ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో 260 మంది మృతిచెందారు. మియాతో పాటు మరికొంత మందిని కిడ్నాప్ చేశారు.మియా ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నామని ఐడీఎఫ్ తెలిపింది.
Le #Hamas commence son petit jeu sordide et publie sur sa chaine Telegram, la vidéo d’une otage.
Ici, Mia Schem, kidnappée samedi au Festival Supernova et amenée à #Gaza.
Elle est visiblement blessé au bras et explique, comme prévu, être bien traité, nourri, logée, blanchi.💀 pic.twitter.com/U1ieOXDzdU— Crétin des Alpes (@Krokenbouche) October 16, 2023