Israel-Hamas war | గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌కు ధీటుగా బదులిచ్చిన ఇజ్రాయెల్
Israel-Hamas war | ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న పోరును ఉద్దేశించి పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) చేసిన ట్వీట్‌కు ఇజ్రాయెల్ దీటుగా బదులిచ్చింది. గాజాకు మద్దతుగా కొందరితో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న చిత్రాన్ని థన్‌బర్గ్ ట్విటర్లో పోస్టు చేశారు.
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న పోరును ఉద్దేశించి పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) చేసిన ట్వీట్‌కు ఇజ్రాయెల్ దీటుగా బదులిచ్చింది. గాజాకు మద్దతుగా కొందరితో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న చిత్రాన్ని థన్‌బర్గ్ ట్విటర్లో పోస్టు చేశారు. ‘పాలస్తీనా, గాజాకు మా మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రస్తుత పోరుపై ప్రపంచం స్పందించాలి. పాలస్తీనా ప్రజలు, ఇతర బాధితుల తరఫున తక్షణమే కాల్పుల విరమణ, న్యాయం, స్వేచ్ఛ కోసం పిలుపునివ్వాలి’ అని గ్రెటా తన ట్వీట్లో పేర్కొన్నారు.
దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ‘హమాస్ దాడుల వల్ల ఎంతోమంది అమాయకులైన ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధ బాధితులు మీ స్నేహితులు కూడా కావొచ్చు. వారి కోసం మాట్లాడండి’ అంటూ ఘాటుగా స్పందించింది. కాగా, హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తోంది.
శుక్రవారం ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆస్పత్రికి అంబులెన్సులు వరుస కట్టి రావడం కనిపించింది. గాజాలో రెండో అతిపెద్ద ఆస్పత్రి అది. ఇప్పటికే అధిక సంఖ్యలో రోగులు, క్షతగాత్రులతో పాటు ఆశ్రయం కోరి ఉన్నవారితో ఆ ఆస్పత్రి కిక్కిరిసి ఉంది. శుక్రవారం నాటి దాడులతో అక్కడ మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

