బుధవారం 03 జూన్ 2020
International - Apr 11, 2020 , 16:37:45

అమెరికాలో హెచ్‌1బీ వీసాదారుల ఉద్యోగాలకు ముప్పు

అమెరికాలో హెచ్‌1బీ వీసాదారుల ఉద్యోగాలకు ముప్పు

కరోనా వైరస్‌.. డాలర్‌ డ్రీమ్స్‌ను చెదురగొడుతున్నది. డాలర్లు సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలనే తపనతో హెచ్‌1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు సమాధి కాబోతున్నాయి. కరోనాతో అమెరికా ఆర్థిక రంగం కుదేలుకాగా.. అనేక సంస్థలు హెచ్‌1బీ ఉద్యోగులపై వేటువేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు మూడు లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులుండగా.. రానున్న 5-7 నెలల్లో 20-30 శాతం మంది అంటే దాదాపు 90 వేల మందిని బలవంతంగానైనా స్వదేశాలకు పంపుతారని ప్రముఖ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. హెచ్‌1బీ వీసాదారులు 60 రోజులకుపైగా నిరుద్యోగులుగా ఉంటే అమెరికా విడిచివెళ్లిపోవాలన్న నిబంధన వారిపాలిట గండంగా మారనున్నది. ఈ గడువును 180 రోజులకు పెంచాలంటూ ఎన్నారైలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.  ReadMore


logo