వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికన్ హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్లు మార్చి 7న ప్రారంభమై, అదే నెల 24న ముగుస్తాయి. నిరుడు ఈ ఫీజు ఒక్కొక్క లబ్ధిదారుడికి 10 డాలర్లు ఉండేది, దీనిని 125 డాలర్లకు పెంచారు. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశపెట్టిన విధానాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీని కోసం అనుసరించే బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్లో ఒక బెనిఫిషియరీ(లబ్ధిదారు) తరపున అనేక రిజిస్ట్రేషన్లను సమర్పించినప్పటికీ, లాటరీలో కేవలం ఒకసారి మాత్రమే ప్రవేశించే అవకాశం ఉంటుంది. బెనిఫిషియరీ పాస్పోర్ట్ నంబరును ఉపయోగిస్తారు. కాబట్టి అదే ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. అందువల్ల ఎన్నిసార్లు లాటరీలో ప్రవేశించారో తెలిసిపోతుంది.