చెన్నై: పాస్‌పోర్ట్‌లో ఇంటి పేరు లేదనే కారణంతో ప్రయాణికుడిని విమానం ఎక్కనివ్వని గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌కు షాక్ తగిలింది. టిక్కెట్ ఖర్చు, సేవా లోపం, ఆర్థిక, మానసిక నష్టాలకు పరిహారంగా నిజాముద్దీన్‌కు రూ.1.4 లక్షలు చెల్లించాలని గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది నిజాముద్దీన్ 2023 ఫిబ్రవరి 9న మాస్కో నుంచి దుబాయ్‌కి గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే, ఆయన పాస్‌పోర్ట్‌లో ఆయన ఇంటి పేరు లేదనే కారణంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాస్కో విమానాశ్రయంలో ఆయనను విమానం ఎక్కనివ్వలేదు. తాను దుబాయ్‌లో జరిగే సమావేశంలో పాల్గొనవలసి ఉందని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదు. గంటన్నరపాటు ఆలస్యమవడంతో నిజాముద్దీన్ దుబాయ్ వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. పాస్‌పోర్ట్‌లోని పేరుతోనే తాను భారత్ నుంచి మాస్కోకు ప్రయాణించేందుకు అనుమతించారని నిజాముద్దీన్ తన ఫిర్యాదులో తెలిపారు.