Strait of Hormuz | భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు గురైన మూడు నౌకల్లో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు గురైన మూడు నౌకల్లో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది. ఈ నౌక ఇండియాకు వస్తున్నప్పటికీ, అది ఇండియా నౌక కాదు. ఈ నౌకలపై కాల్పులు జరపడంతోపాటు, వాటిని ఐఆర్జీసీ (ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్) స్వాధీనం చేసుకుంది.
ఈ మూడు నౌకల్లో ఒకటి పనామాకు చెందిన ఎంఎస్సీ ఫ్రాన్సెసా కాగా, రెండోది లైబీరియాకు చెందిన ఎపామినోడోస్ అనే నౌక. మూడో నౌక గ్రీక్కు చెందిన యుఫోరియా. ఇందులో ఎపామినోడోస్ అనే నౌక దుబాయ్ నుంచి ఇండియాలోని గుజరాత్, ముంద్రా పోర్టుకు వస్తున్నట్లు మ్యారిటైమ్ ట్రాఫిక్ డాటా ద్వారా తెలుస్తోంది. తాజాగా నౌకలపై ఇరాన్ దాడి చేయడంతో హార్ముజ్ జలసంధి వద్ద మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత వారం ఇండియా నౌకపై ఐఆర్జీసీ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. ఇరాన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల రెండు ఇరాన్ నౌకల్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. బదులుగా ఇరాన్.. ఈ నౌకలపై దాడి చేసి, వాటిని తమ అధీనంలోకి తీసుకుంది.
ఒకవైపు కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించినప్పటికీ, ఇరాన్ మాత్రం అంగీకరించడం లేదు. అమెరికాతో శాంతి చర్చలకు కూడా ఇరాన్ విముఖత చూపుతోంది. మరోవైపు ‘దేశ్ గరిమ’ అనే భారత నౌక ముంబై తీరానికి చేరుకుంది. ఇందులో 31 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే, భారీ స్థాయిలో ముడి చమురు ఉంది. ఈ నౌక హార్ముజ్ నుంచి ఈ నెల 18న బయల్దేరింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి నుంచి ఇండియా చేరుకున్న పదో భారత నౌక ఇది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

