ఏథెన్స్: యూరోప్ దేశమైన గ్రీసులో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.7గా ఉన్నట్లు ఆ దేశ జియోడైనమిక్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. భూ కంపం వల్ల ఎటువంటి నష్టం కానీ, గాయాలు అయినట్లు ఇంత వరకు రిపోర్ట్ అందలేదు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.1గా ఉన్నట్లు యురోపియన్ మెడిటరేనియన్ సెసిమాలాజికల్ సెంటర్ పేర్కొన్నది. అయితే ఈజిప్టులోని పలు నగరాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర గర్భంలో భూమి కంపించినట్లు జియోడైనమిక్ ఇన్స్టిట్యూట్ డైరక్టర్ ఆకిస్ టెలింటిస్ చెప్పారు. ఒకవేళ ఆ ప్రకంపనలు భూమిపై సంభవిస్తే నష్టం తీవ్రంగా ఉండేదన్నారు.