న్యూయార్క్: అమెరికా తీసుకొచ్చిన కొత్త పాలసీ నేపథ్యంలో ఉద్యోగులెవరూ అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని గూగుల్ యాజమాన్యం ఆదేశించింది. కొత్తగా తీసుకొచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ నేపథ్యంలో వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వాయిదా పడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నదని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికాకు తిరిగి రావాలంటే ప్రస్తుతం వీసా స్టాంపింగ్‌కు కొన్ని నెలలు ఆలస్యమవుతున్నది.
ఈ నెల 15 నుంచి అమెరికాలో సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో తమ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా గూగుల్ పలు సూచనలు చేసింది. ఎఫ్, జే, ఎం వీసాలపైనా దీని ప్రభావం ఉన్నట్టు గూగుల్ న్యాయ నిపుణులు చెప్తున్నారు. వీసా అపాయింట్మెంట్లకు మరింత ఆలస్యం జరుగుతుందని పేర్కొన్నారు.