పెన్సిల్వేనియా: సూది అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలిపే పరికరాన్ని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిని లేజర్ ఇండ్యూస్డ్ గ్రాఫీన్(ఎల్ఐజీ) అని పిలుస్తున్నారు. ఇది చెమట ద్వారా గ్లూకోజ్ స్థాయిని తెలుపుతుంది. రక్తంతో పోల్చితే చెమటలో 100 రెట్లు తక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఈ చెమటలో గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నికెల్, బంగారంతో చేసిన లోహ మిశ్రమాన్ని వాడారు. దీనికి బయోఎలక్ట్రికల్స్, బయోసెన్సర్లు అనుసంధానం చేసి గ్లూకోజ్ స్థాయిని తెలుసుకొంటారు.