అపార్ట్మెంట్లోని తొమ్మిదో ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరికి దొరికిన దారి గుండా వాళ్లు తప్పించుకున్నారు. కానీ.. ఓ అమ్మాయి మాత్రం మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో తనను కాపాడటం కోసం ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగారు. తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడారు.
ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటు చేసుకుంది. ఆ అమ్మాయిని కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింది ఫ్లోర్ కిటికీ నుంచి.. పై ఫ్లోర్ కిటికీ ద్వారా ఆ అమ్మాయిని కిందికి జాగ్రత్తగా దించి సేవ్ చేశారు. ఏమాత్రం అటూ ఇటూ అయినా.. ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు ఆ అమ్మాయి కూడా కింద పడిపోయేది. ఎంతో చాకచక్యంగా ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు వ్యక్తులను స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.