టెహ్రాన్: హిజాబ్ నిబంధన పాటించని మహిళలపై ఇరాన్ నైతిక పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దాడి వల్ల మరో బాలిక కోమాలోకి వెళ్లింది. (Iranian girl In Coma) దీంతో ఆ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 16 ఏళ్ల అర్మితా గరావాండ్ అనే యువతి ఆదివారం
టెహ్రాన్‌లోని మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె హిజాబ్ నిబంధన పాటించనందుకు మహిళా పోలీసులు కొట్టినట్టు కుర్దీష్ హక్కుల సంఘం హెంగావ్ ఆరోపించింది. దీంతో ఆ బాలిక కోమాలోకి వెళ్లిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. ఒక యువతిని మెట్రో రైలు నుంచి దించి తీసుకెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఆ బాలిక లో బీపీ వల్ల సొమ్మసిల్లిపడిపోయిందని తెలిపారు. పోలీసుల చర్యకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ మెట్రో స్టేషన్ అధికారులు కూడా ప్రభుత్వ వాదనను సమర్థించారు.
మరోవైపు గత ఏడాది హిజాబ్ ధరించనందుకు రోడ్డుపై ఉన్న అమినీని ఆ దేశ నైతిక పోలీసులు దారుణంగా కొట్టారు. దీంతో కోమాలోకి వెళ్లిన ఆ యువతి కొన్ని రోజుల తర్వాత మరణించింది. ఈ సంఘటన నేపథ్యంలో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. పోలీస్ యాక్షన్‌లో పలువురు మరణించగా చాలా మంది అరెస్ట్ అయ్యారు.
🚨 🚨 🚨
She, 16, is now in a coma!after being attacked by the immoral law enforcement in the subway in Tehran.
Her name is Amrita Gravand.
*The narrator is a propagandist for disinformation pic.twitter.com/a3xsZLNgbb
— 🏴Iranian American 🇺🇸 (@IranLionness) October 3, 2023