China | బీజింగ్: చైనాలో జనన రేటు పెంచేందుకు రకరకాల పథకాలు, ఆఫర్లు తెరపైకి తీసుకొస్తున్నారు. కొత్త జంటలకు జిజియాంగ్ ప్రావిన్స్‌లో ఛాంగ్షాన్ కౌంటీ ఆఫర్లు ప్రకటించింది. వధువు వయసు 25 ఏండ్లు లోపు ఉంటే.. ఆ జంటకు వెయ్యి యువాన్లు (సుమారుగా రూ.11,488) నగదు పురస్కారం ఇవ్వనున్నట్టు స్థానిక ప్రభుత్వం తెలిపింది.
మొదటి సంతానం సమయంలో, శిశు సంరక్షణ, స్కూల్లో చేర్పించేప్పుడు సబ్సిడీలు ఉంటాయని నోటీస్‌లో పేర్కొన్నారు. 2022లో చైనాలో జననాల రేటు 1.09 శాతానికి పడిపోయింది. చట్ట ప్రకారం వివాహ వయసు పురుషులకు 22, మహిళలకు 20 ఏండ్లు వచ్చి ఉండాలి.