బెర్లిన్: జర్మనీలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 50,196 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరగడం వరుసగా ఇది నాలుగవ రోజు. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 4.89 మిలియన్లుగా ఉంది. మరణాల సంఖ్య 97 వేలకు చేరినట్లు రాబర్ట్ కోచ్ ఇన్సిటిట్యూట్ తెలిపింది. ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పెట్టాలన్న ఆలోచనలేదని ప్రభుత్వం చెప్పింది. నాటకీయమైన రీతిలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ అన్నారు. సాక్సోనీ, బవేరియా, బెర్లిన్ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వారి కోసం కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు టీకాలు తీసుకోని వారిని.. రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్ హాల్స్‌కు అనుమతించేదిలేదని ప్రభుత్వం ఆదేశించింది.