Muhammad Yunus | మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు.. హాదీ అంత్యక్రియల్లో యూనస్ వ్యాఖ్యలు
Muhammad Yunus | భారతదేశ వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ (Osman Hadi) ఆదర్శాలను తాము ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) అన్నారు.
Muhammad Yunus : భారతదేశ వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ (Osman Hadi) ఆదర్శాలను తాము ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) అన్నారు. హాదీ అంత్యక్రియల్లో పాల్గొన్న యూనస్.. అక్కడున్న వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘ఉస్మాన్ హాదీ నేను మీకు వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడకు రాలేదు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం ఈ దేశ ప్రజలందరి హృదయాల్లో మీరు ఉంటారు. అక్కడి నుంచి నిన్ను ఎవరూ తొలగించలేరు. నువ్వు మాకు చెప్పిన మాటను నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నా. దేశ ప్రజలందరూ మీ ఆదర్శాలను కొనసాగిస్తారు’ అని యూనస్ వ్యాఖ్యానించారు.
హాదీ ప్రేమ, మానవత్వం, ప్రజలతో కలిసిపోయే విధానాన్ని యూనస్ ప్రశంసించారు. ఈ దేశం మరచిపోలేనీ మంత్రాన్ని హాదీ తమకు ఇచ్చారని, అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని అన్నారు. ప్రపంచం ముందు బంగ్లా తలెత్తుకుని ఉంటుందని, ఎవరి వద్ద తలవంచదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాల్గొనాలనే హాదీ అకాంక్ష గురించి గుర్తుచేశారు.
కాగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు గత ఏడాది విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో హాదీ కీలకపాత్ర పోషించాడు. ఈనెల ఆరంభంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దాంతో ఆయన చికిత్స పొందుతూ మృతిచెందాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

