డెయిర్ అల్-బలాహ్ (గాజా స్ట్రిప్) : ఇజ్రాయెల్-హమాస్ మధ్య 20 నెలల నుంచి జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనీయుల సంఖ్య 55,104 అని గాజా హెల్త్ మినిస్ట్రీ బుధవారం ప్రకటించింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది.
దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ, తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని, సామాన్య ప్రజల మరణాలకు కారణం హమాస్ ఉగ్రవాద సంస్థేనని చెప్పింది. ప్రజల మధ్య ఉగ్రవాదులు దాక్కుంటున్నారని తెలిపింది. ఈ యుద్ధంలో 1,27,394 మంది గాయపడినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.