వాషింగ్టన్, డిసెంబర్ 8: స్వలింగ పెండ్లిళ్లకు అమెరికా ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది. డెమొక్రాట్లు మొత్తం మంది, రిపబ్లికన్లలో 39 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 169 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర కోసం పంపిస్తారు. ఆయన ఆమోదించగానే చట్టంగా మారుతుంది. సెనేట్ ఈ బిల్లును గత నెలలోనే ఆమోదించింది.