న్యూయార్క్: స్వలింగ సంపర్కుల జంటకు(Gay Couple) అమెరికా కోర్టు వందేళ్ల జైలుశిక్ష వేసింది. పేరోల్ కూడా తీసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. దత్తత తీసుకున్న కుమారులను .. లైంగికంగా వేధించిన కేసులో గే జంటకు వాల్టన్ కౌంటీ జిల్లా అటార్నీ ఈ శిక్షను విధించారు. 34 ఏళ్ల విలియమ్, 36 ఏళ్ల జాచరి జులాక్ అనే ఇద్దరికీ ఈ శిక్ష పడింది. ఈ ఇద్దరూ 12, 10 ఏళ్లు ఉన్న ఇద్దరు సోదరుల్ని దత్తత తీసుకున్నారు. అట్లాంటా శివారుల్లో ఉండే ఆ గే జంట.. హ్యాపీ ఫ్యామిలీ పేరుతో పిల్లల్ని పెంచేందుకు అంగీకరించారు. కానీ ఆ పిల్లలకు నరకం చూపించినట్లు జిల్లా అటార్నీ రాండీ మెక్గిన్లే తెలిపారు. దత్తత పిల్లల్ని రేప్ చేసినట్లు అటార్నీ తన తీర్పులో వెల్లడించారు.
జాచరి బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేస్తున్నాడు. ఇక విలియమ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ల జీవితాల్లో బాగానే సెటిల్ అయ్యారు. కానీ రెగ్యులర్‌గా దత్తత పిల్లలను శృంగారంలోకి దింపేవారట. ఇంకా వారితో జరిగే సెక్స్‌ను వీడియోలు తీసేవారు. ఆ తీసిన చిత్రాలను తమ స్నేహితులతో ఆ జంట షేర్ చేసుకునేదని కోర్టులో తేలింది. పోలీసులకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా దీన్ని కన్ఫర్మ్ చేశారు. విలియమ్, జాచరిలను 2022లో అరెస్టు చేశారు.
పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్న ఫోటోలను ఆ జంట ఓ స్నేహితుడికి స్నాప్‌చాట్ చేసినట్లు తెలిసింది. పెడోఫైల్ సెక్స్ రింగులో ఆ పిల్లల్ని దించినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో ఆ పిల్లల గురించి తప్పుగా ప్రచారం చేశారు. చైల్డ్ పోర్న్‌ను డౌన్లోడ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత .. ఆ గేంట అఘాయిత్యాలకు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ దత్తత పిల్లలతో పోర్న్ వీడియోలు చేసేవారని ఆ గే జంటపై ఫిర్యాదు నమోదు అయ్యింది.