వాషింగ్టన్, అక్టోబర్ 11: భారత జాతిపిత మహాత్మాగాంధీకి అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది.
న్యూజెర్సీలోని అట్లాంటిక్ నగరంలో దీన్ని గతవారం ప్రారంభించారు. ఇందులో ఏర్పాటు చేసిన కళాఖండాలు, డిజిటల్ డిస్ప్లేల ద్వారా మహాత్ముడి జీవిత సంఘటనలను ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియంను ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్యంతో న్యూజెర్సీ గాంధీయన్ సొసైటీ నిర్మించింది. యూఎస్‌లో గాంధీజీకి అంకితం చేసిన మొదటి మ్యూజియం ఇదే.