e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News Galileo Telescope : గెలీలీయో టెలిస్కోప్‌కు 412 ఏండ్లు

Galileo Telescope : గెలీలీయో టెలిస్కోప్‌కు 412 ఏండ్లు

దూరంలో ఉన్న వస్తువులను చూసేందుకు ఇటలీకి చెందిన శాస్త్రవేత్త గెలీలీయో గెలీలీ (Galileo Telescope) 412 ఏండ్ల క్రితం అనగా.. 1609 లో సరిగ్గా ఇదే రోజున టెలిస్కోప్‌ను కనిపెట్టాడు. తొలుత 50 మైళ్ల దూరంలోని వస్తువులను చూసేందుకు వీలుపడింది. దీనితో ఏ వస్తువునైనా 8 రెట్లు పెద్దదిగా చూసే అవకాశం కలిగింది. దీని సాయంతోనే గెలిలియో అంతరిక్షంలో అనేక పరిశోధనలు చేసి ఎంతో విలువైన సమాచారాన్ని మనకందించారు. దీని ఆవిష్కరణ కారణంగా అనంతరం కాలంలో అంతరిక్షంలోని ఎన్నో విశేషాలను వీక్షించేందుకు వీలుకలిగింది.

ఇటలీలోని పీసా ప్రాంతంలో 1564 ఫిబ్రవరి 15 న జన్మించిన గెలీలీయో గెలీలీ.. పీసా విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్‌ చదివారు. అయితే, తన ఆలోచనలన్నీ గణితం చుట్టూ తిరుగుతుండటంతో తండ్రి కోరికను కాదని గణితంలోనే ప్రవీణ్యత సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వేగం, బరువులను కొలిచే యూనిట్లపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనతో ఆయన పేరు మార్మోగిపోయి.. పలు విశ్వవిద్యాలయాలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభించింది. కొన్నిరోజుల పాటు పీసా విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించిన గెలీలీయో.. అనంతరం పదువా యూనివర్శిటీలో అధ్యాపకుడిగా కొనసాగారు.

- Advertisement -

1609 సంవత్సరంలో నెదర్లాండ్స్‌లో టెలిస్కోప్ కనుగొన్నట్లు వచ్చిన వార్తలు చూసిన గెలీలీయో.. అంత కంటే శక్తివంతమైన టెలిస్కోప్‌ను అతి తక్కువ సమయంలో తయారు చేశారు. ఈ టెలిస్కోప్ ఏదైనా వస్తువును 3 రెట్లు పెద్దదిగా చూపించగలదు. లెన్స్‌ల కలయికను మార్చడం ద్వారా దాని శక్తిని 8 రెట్లు పెంచారు. తన టెలిస్కోప్‌ను వెనిస్‌ సెనేట్‌ సభ్యుల ఎదుట ప్రదర్శించగా.. వారు 35 మైళ్ల దూరంలోని సెయింట్‌ గిస్టినా టవర్‌ను, అనంతరం 50 మైళ్ల దూరంలోని ట్రెవిసో, కొనిగ్లియానో నగరాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని తర్వాత, గెలీలియా తన టెలిస్కోప్‌ ద్వారా గ్రహాలు, విశ్వాన్ని అధ్యయనం చేయడం మొదలెట్టాడు. చంద్రుడు, సూర్యుడు, జ్యుపీటర్‌, వీనస్‌ గ్రహాలను అధ్యయనం చేశారు. దీని ఆధారంగానే విశ్వంలోని కొత్త కొణాలపై 1610 లో ‘స్టారీ మెసెంజర్‌’ అనే పుస్తకాన్ని రాశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పారు. దీని కారణంగా చర్చి పెద్దలు అతడిని మతవిశ్వాస ఘాతకుడుగా భావించి గృహ నిర్బంధంలో ఉంచారు. మరణించే వరకు గెలీలీయో గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2003 : ముంబైలో రెండు ట్యాక్సీల్లో పేలుడు సంభవించి 44 మంది దుర్మరణం, 150 మందికి గాయాలు

2001 : టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధికంగా 400 వికెట్లు తీసి రికార్డును సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌

1991 : ఫార్ములా వన్‌ రేసింగ్‌లో ఆరంగేట్రం చేసిన జర్మనీకి చెందిన మైఖేల్‌ షూమేకర్‌

1957 : ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియానా పోల్‌ జట్టు

1917 : బ్రిటీష్‌ ఇండియా ఆర్మీలో తొలిసారి ఏడుగురు భారతీయులకు కింగ్స్‌ కమిషన్‌

1867 : ప్రముఖ్య శాస్త్రవేత్త మైఖల్‌ ఫారడే మరణం

1819 : ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్‌ వాట్‌ మరణం

ఇవి కూడా చ‌ద‌వండి..

జేమ్స్‌ బాండ్‌ మ్యూజిక్‌తో అలరించిన ముంబై పోలీసులు

మర్మాంగానికి సీల్‌.. యువకుడు మృతి

ఈ ఆహారాలు తీసుకోండి‌.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement