న్యూయార్క్, మే 30: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికాకు చెందిన ఓక్ నేషనల్ ల్యాబోరేటరీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీని పేరు ‘ఫ్రాంటియర్’. సెకన్ వ్యవధిలో రెండు క్వింటిలియన్ (2 ఎక్సాఫ్లాప్ స్పీడ్) లెక్కలను చేసి పెడుతుంది.
అంకెల్లో చెప్పాలంటే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంత అవుతుందో.. అన్ని లెక్కలను సెకన్ వ్యవధిలో పరిష్కరిస్తుందన్న మాట. జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన ‘ఫుగాకు’ (సెకనుకు 1.1 ఎక్సాఫ్లాప్స్ స్పీడ్) సూపర్ కంప్యూటర్‌కే ఇప్పటివరకూ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా పేరుంది.