బెర్లిన్: జర్మనీ నూతన చాన్స్‌లర్‌గా కన్జర్వేటివ్ నేత ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. మంగళవారం ఆ దేశ పార్లమెంట్లో నిర్వహించిన ఓటింగ్‌లో తొలుత అనూహ్యంగా పరాజయం పాలైనా, రెండో రౌండ్ ఓటింగ్‌లో గట్టెక్కారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ చాన్స్‌లర్ ఎన్నికల్లో ఏ నాయకుడు కూడా మొదటి రౌండ్ వోటింగ్‌లో ఓడిపోలేదు. రెండో రౌండ్ ఓటింగ్‌తో చాన్స్‌లర్ పదవి దక్కించుకున్న నాయకుడిగా మెర్జ్ నిలిచారు.