France : ఫ్రాన్స్ త్వరలోనే మొరాకో దేశస్థులపై వీసా ఆంక్షల్ని ఎత్తేయనుంది. ఇరుదేశాల మధ్య ఏడాది కాలంగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలకనుంది. . మొరాకో దేశస్థులపై విధించిన వీసా ఆంక్షలు రద్దు చేస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కేథరిన్ కలొన్న స్వయంగా వెల్లడించింది. డిసెంబర్ 16వ తేదీన మొరాకో రాజధాని రబత్లో ఆమె ఆ దేశ విదేశాంగ మంత్రి నసీర్ బౌరితను కలుసుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్లో మొరాకోపై ఫ్రాన్స్ విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఫ్రాన్స్ 2-0తో మొరాకోను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఫ్రాన్స్‌లో 7 లక్షల మందికి పైగా మొరాకో మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. వీసా నిబంధనల కారణంగా మొరాకో నుంచి వచ్చే బంధువులు వీళ్లను కలవలేకపోతున్నారు. దాంతో, ఈ విషయమై మొరాకో, ఫ్రాన్స్ దేశాల మధ్య సంవత్సర కాలంగా వివాదం నడుస్తోంది. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న తమ పౌరులను స్వదేశాలకు ఉత్తర ఆఫ్రికా దేశాలు అంగీకరించలేదు. దాంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అందువల్ల సరైన ధ్రువ పత్రాలు లేకుండా తమ దేశానికి వచ్చే మొరాకో, అల్జీరియా, ట్యునియా దేశస్థులకు జారీ చేసే వీసాలపై ఫ్రాన్స్ కోత విధించింది.