ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి, అమెరికాతో సహా పలు దేశాల ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఫోన్లో సంభాషించారు. ఈయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలనే వీరిద్దరూ పుతిన్‌కి సూచించారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. అయితే గురువారమే ఈ ముగ్గురూ ఫోన్లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ఈ ఇద్దరు నేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి సూచించారు. తక్షణమే యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా ఓ పరిష్కారానికి రావాలని జర్మన్ ఛాన్సలర్, ఫ్రాన్ అధ్యక్షుడు మక్రాన్ పుతిన్‌కు సూచించారు.
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకూ 79 మంది చిన్నారులు మరణించారని దాదాపు వంద మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా అణిచివేత శనివారం నాటికి 17వ రోజుకు చేరగా ఇప్పటికే పలు ఉక్రెయిన్ నగరాలు రష్యా వశమయ్యాయి.ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలతో విధ్వంసానికి తెరపడుతుందని ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం నేరుగా సాగుతున్న సంప్రదింపులతో విద్వేషాలు సమసిపోతాయని ఆశిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు.