Emmanuel Macron | పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) క్రీడలు ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)కు ఓ మహిళా మంత్రి గాఢ ముద్దు (Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వివాదానికి దారితీస్తోంది.
గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నదిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలను ఫ్రాన్స్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడితోపాటు పలు దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అంతా ఆరంభ వేడుకల్లో మునిగి తేలుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వేదికపై ఫ్రాన్స్ క్రీడల మంత్రి (Sports Minister) ఎమిలీ కాస్టెరా (Amelie Oudea-Castera).. అధ్యక్షుడిని కౌగలించుకొని అతడి చెంపై గట్టిగా ముద్దుపెట్టింది. ఆ సమయంలో పక్కనే ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియల్ అట్టాల్ కూడా ఉండటం గమనార్హం.
ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ (French magazine) మాడమ్ ఫిగారో (Madame Figaro) తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోను తమ పత్రికలో కథనంగా ప్రచురించింది. ‘ఈ ముద్దు చాలా వింతగా ఉంది..’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఉన్నత హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమంలో ఇలానేనా ప్రవర్తించేది..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘అంతర్జాతీయ వేదికగా ఇద్దరు నేతలు ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరికాదు’, ‘ఇది చాలా ఇబ్బందికర దృశ్యం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ఫ్రాన్స్‌లో సంచలంగా మారింది.
Also Read..
Ismail Haniyeh | హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హనియే హత్య.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘటన..!
North Korea | ఉత్తర కొరియాలో వరదలు.. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్
USA green card | గ్రీన్‌కార్డు హోల్డర్లకు మూడు వారాల్లో అమెరికా పౌరసత్వం..!