పారిస్: ప్లేబాయ్(Playboy) మ్యాగ్జిన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మహిళా మంత్రి ఫోటోను ప్రచురించారు. ఈ ఘటన పట్ల ఫ్రాన్స్(France)లో దుమారం చెలరేగుతోంది. మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మహిళా మంత్రి మర్లీన్ షియప్పా(Marlene Schiappa) చేసిన నిర్వాకం అక్కడ ప్రతిపక్షాల్ని మరింత చిర్రెత్తిస్తున్నది. 40 ఏళ్ల ఫెమినిస్టు మంత్రి అయితన మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. అయితే ప్లేబాయ్ పత్రికపై ఆ మంత్రి ఫోటో ప్రచురణ కావడంతో అక్కడి అతివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్లేబాయ్ పత్రిక కవర్‌పేజీపై ఫోటోనే కాదు.. ఆ పత్రికకు ఆమె 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మహిళా, గే, అబార్షన్ హక్కుల(abortion rights) గురించి ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అన్న హక్కుల్ని డిఫెండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్లో రాసుకున్నారు.
ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో.. మంత్రి మర్లీన్ ఫోటో స్టంట్‌పై స్వంత పార్టీలోనే వ్యతిరేకత వస్తున్నది. మహిళా ప్రధాని ఎలిజబెత్ బోర్న్(Elisabeth Borne) .. మంత్రి మర్లీన్ వైఖరిని తప్పుపట్టారు. షియప్పా ప్రవర్తన సరైనరీతిలో లేదన్నానరు.