పారిస్: ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనకు ఒక రోజు ముందు ప్రతిష్టాత్మక పీ75ఐ సబ్మెరైన్ ప్రాజెక్టు నుంచి ఫ్రెంచ్ కంపెనీ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో పలు నిబంధనలను ప్రస్తావిస్తూ..ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లలేమని ఫ్రెంచ్ డిఫెన్స్ నేవీ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ నేవీ కోసం 6 సబ్మెరైన్లను నిర్మించనున్నారు.