ప్యారిస్: మూడేండ్ల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన ఫ్రాన్స్‌లో మళ్లీ నాటకీయ రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 4 రోజుల క్రితమే రాజీనామా చేసిన ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్నూను తిరిగి పదవి అధిష్ఠించాల్సిందిగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కోరడంతో దేశంలో గత వారం రోజుల రాజకీయ అనిశ్చితికి తెరపడింది.
ఎలిసి ప్యాలెస్‌లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో అధ్యక్షుడు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధ్యక్షుడు తనకు అప్పగించిన బాధ్యతలను అంగీకరిస్తున్నట్టు సెబాస్టియన్ ప్రకటించారు.