హ్యూస్టన్, మే 17: అమెరికాలో నాలుగో అతి పెద్ద నగరమైన హ్యూస్టన్ను గురువారం పెను తుఫాన్ వణికించింది. ఈ తుఫాన్ తాకిడికి నలుగురు పౌరులు మరణించగా, 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వేలాది భవనాల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పలు వీధులను వరద నీరు ముంచెత్తడంతో కార్లు, ఇతర వాహనాలు నీటిలో మునిగాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలన్నింటినీ మూసివేశారు. రెండు విమానాశ్రయాల్లోని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.