తాలిబన్ల నుంచి రక్షణ కోసం బాలికల స్కూలు రికార్డులు దగ్ధం

కాబూల్: తాలిబన్ల నుంచి రక్షణ కోసం బాలికల రికార్డులను స్కూల్ వ్యవస్థాపకురాలు తగులబెట్టారు. బాలికలు, వారి తల్లిదండ్రుల వివరాలు తాలిబన్లకు తెలియకుండా ఉండేందుకు ఈ పని చేసినట్లు తెలిపారు. స్కూల్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ఘనిస్థాన్ పేరుతో షబానా బసిజ్-రసిక్ కేవలం బాలికల కోసం బోర్డింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో వారి వివరాలు తెలియకుండా ఉండేందుకు రికార్డులను కాల్చివేసినట్లు ట్వీట్ చేశారు.
గతంలో తాలిబన్లు విద్యార్థినుల ఉనికి లేకుండా చేసేందుకు వారి స్టడీ రికార్డులను నాశనం చేశారని, తాను కూడా ఒక బాధితురాలినని గుర్తు చేశారు. తాలిబన్ల పతనం తర్వాత 2002లో ఆఫ్ఘన్ మహిళలకు కొత్త అవకాశాలు వచ్చాయని, దీంతో టెస్ట్ ద్వారా పబ్లిక్ స్కూల్లో చేరి ఉన్నత విద్యనభ్యసించినట్లు తెలిపారు. అనంతరం బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బోర్డింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అయితే 20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి రావడంతోపాటు షరియా చట్టం విధించడంతో మహిళల్లో భయాందోళన వ్యక్తమవుతున్నదని షబానా అన్నారు. తాను, కొంత మంది విద్యార్థినులు, ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నప్పటికీ దేశంలోని చాలా మంది మహిళల పరిస్థితి దారుణంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలికలు, వారి తల్లిదండ్రుల వివరాలు తాలిబన్ల చేతికి చిక్కకుండా సంబంధిత రికార్డులను మాత్రమే తగులబెట్టినట్లు ఆమె ట్వీట్ చేశారు.
అయితే ఆఫ్ఘన్లో తిరిగి మంచి రోజులు రావచ్చని షబానా ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు ఆఫ్ఘన్ బాలికల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యకు పెట్టుబడులు పెడతానని వెల్లడించారు.
Nearly 20 years later, as the founder of the only all-girls boarding school in Afghanistan, I’m burning my students’ records not to erase them, but to protect them and their families.
— Shabana Basij-Rasikh (@sbasijrasikh) August 20, 2021
2/6 pic.twitter.com/JErbZCSPuC
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

