వాటికన్ సిటీ, డిసెంబర్ 29: మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. బెనెడిక్ట్ కోసం దేవుడిని ప్రార్థించాలని సందేశమిచ్చారు. క్యాథలిక్ మతాధిపతిగా వ్యవహరించిన బెనెడిక్ట్ (95) వృద్ధాప్య కారణాలతో 2013లో పోప్ పదవి నుంచి వైదొలిగారు. హృద్రోగ, ఇతర వ్యాధులతో ఆయన కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారని వాటికన్ సిటీ చర్చి వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి.