బ్యూనస్ ఏరిస్: ఇద్దరు అందెగత్తెలు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని వాళ్లు ఇన్‌స్టా వీడియో ద్వారా చెప్పేశారు. ఇక ఆ వీడియోకు ఇప్పటికే 30 లక్షల వ్యవూస్ వచ్చాయి. సుమారు మూడు లక్షల మంది లైక్ కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనా మాజీ సుందరి మారియానా వరేలా, ప్యూర్టో రికో మాజీ సుందరి ఫాబియానో వాలెంటినాలు పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు సుందరీమణులు థాయిలాండ్‌లో 2020లో జరిగిన మిస్ గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అక్కడ వాళ్లిద్దరి మధ్య పరియం జరిగింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ ప్రేమపక్షులయ్యారు. చాలా సీక్రెట్‌గా ఆ ఇద్దరూ అఫైర్ నడిపారు. అయితే ఆ బ్యూటీ క్వీన్స్ ఇప్పుడు తమ రిలేషన్‌ను బహిర్గతం చేసేశారు.
సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఓ పోస్టు పెట్టారు. స్పానిష్ భాషలో ఫాబియానా తమ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉన్న తమ పరిచయాన్ని ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. తన వీడియో పోస్టుకు హార్ట్, రింగ్ ఎమోజీలను కూడా జోడించారు. ఇద్దరూ బీచ్‌లో రొమాంటిక్ వాక్ చేస్తున్నట్లు, కౌగిలించుకుంటున్నట్లు, ప్రపోజ్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది.
అర్జెంటీనా, ప్యూర్టో రికా బ్యూటీలు పెళ్లి చేసుకున్న విషయం బయటకి పొక్కడంతో ఆ జంటకు కంగ్రాట్స్ వెల్లువెత్తుతున్నాయి.