భారీగా డబ్బు ఖర్చు పెట్టి నీళ్లలో తేలియాడే భవనం కట్టించుకుంటే.. అది లాంచ్ చేసిన రోజే నీళ్లలో మునిగిపోతే ఎలా ఉంటుంది? పనామా అనే కంపెనీకి అలాంటి అనుభవమే ఎదురైంది. ‘సీపాడ్’ పేరిట ఆ కంపెనీ ఒక భవనాన్ని తయారు చేసింది. ఇది నీళ్లలో తేలియాడుతూ ఉంటుంది. సుమారు 300 గజాల విస్త్రీర్ణంలో లివింగ్ రూం ఉంటుంది.
ఇది కాకుండా దీనికి కొంచెం దూరంగా నీటి మట్టానికి 7.5 అడుగుల ఎత్తులో మూడు హాఫ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. దీని నిర్మాణానికి 1.5 మిలియన్ డాలర్లు (మన లెక్కల్లో రూ.12 కోట్లపైగానే) ఖర్చయిందట. దీన్ని లాంచ్ చేసే కార్యక్రమానికి పనామా కంపెనీ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. అప్పటికే కొన్ని రోజులుగా ఆ నీళ్లలో ఉన్న ఈ సీపాడ్.. అందరూ చూస్తుండగానే అలా ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో అక్కడకు వచ్చిన చాలా మంది భయపడిపోయారు.
దీనిపై పనామా కంపెనీ వివరణ ఇచ్చింది. ‘సీపాడ్లోని బాలాస్ట్ ట్యాంక్, పంపింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య కారణంగా జాకూజీ స్పార్లోని నీళ్లు చేరాయి. దీని వల్లనే సీపాడ్ ఇలా ఒరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కనీసం ఎవరి కాళ్లు కూడా తడవలేదు’ అని పేర్కొంది.
La empresa Ocean Builders mediante un comunicado señaló que el prototipo del SeaPod Eco comenzó a destabilizarse, sin embargo, se está investigando las causas, mientras se realizan los trabajos en las soluciones apropiadas. confirman que no hubo personas afectadas. #AcontecerC3 pic.twitter.com/4z9ryc6CKK
— Carlos_cuadro (@Carloscuadro9) September 23, 2022
@OceanBuilders what happened here? #Panama #seapod pic.twitter.com/yOqHsVgqMB
— Marlon Torres 🇵🇦 🇺🇸 (@Marlon_PTY) September 23, 2022