కాలిఫోర్నియా : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ కుప్పకూలిపోయింది. టెక్సాస్లోని బోకా చికా నుంచి ప్రయోగించిన కొద్ది సేపటికే కూలిపోయింది.
దీనిని ప్రయోగించడం ఇది ఏడోసారి. ఇది మెక్సికో గల్ఫ్పైన కూలిపోయి, శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను అనేక మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.