శుక్రవారం 15 జనవరి 2021
International - Jan 09, 2021 , 16:53:16

బిగ్ బ్రేకింగ్: ఇండోనేషియాలో విమానం అదృశ్యం

బిగ్ బ్రేకింగ్: ఇండోనేషియాలో విమానం అదృశ్యం

జ‌కర్తా: ఇండోనేషియాలో శ్రీవిజ‌య సంస్థ‌కు చెందిన ప్యాసింజ‌ర్ ఫ్లైట్ అదృశ్యం ఉత్కంఠ రేపుతున్న‌ది. రాజ‌ధాని జ‌క‌ర్తా నుంచి బ‌య‌లుదేరిన నాలుగు నిమిషాల‌కే SJ182 నంబ‌ర్‌గ‌ల బోయింగ్-737-500 విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో అధికారులు విమానం జాడ కోసం ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. రాడార్ స‌మాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అదృశ్య‌మైన విమానంలో ఐదుగురు చిన్నారులు స‌హా 56 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది క‌లిపి మొత్తం 62 మంది ఉన్నార‌ని శ్రీవిజ‌య సంస్థ తెలిపింది. 

విమానం జ‌క‌ర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోం‌టియాన‌క్‌కు వెళ్తూ అదృశ్య‌మైంద‌ని ఇండోనేషియా ట్రాన్స్‌పోర్టు మినిస్ట్రీ వెల్ల‌డించింది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయ‌ని తెలిపింది. అదృశ్య‌మైన స‌మ‌యంలో విమానం 10 వేల అడుగుల ఎత్తులో ఉంద‌ని వెల్ల‌డించింది. కాగా, ఇండోనేషియాలో ఎక్కువ ర‌ద్దీకి తోడు భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు స‌రిగా పాటించ‌క‌పోవ‌డంతో త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.