Flight Landing Gear : దక్షిణ కొరియా (South Korea) లో ల్యాండింగ్ గేర్ (Landing Gea) సమస్యతో ఓ విమానం కూలిపోయి 179 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కొరియా దేశంలోనే మరో ఫ్లైట్‌లో ల్యాండ్ గేర్ సమస్య తలెత్తింది. జెజూ ఎయిర్ ఫ్లైట్ (Jeju Air flight) రాజధాని సియోల్ నుంచి విమానం జెజూ ఐలాండ్‌కు వెళ్తుండగా పైలట్ సమస్యను గుర్తించాడు.
సియోల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ సమస్యను గుర్తించాడు. వెంటనే గ్రౌండ్ కంట్రోల్‌కు విషయం తెలియజేశాడు. వాళ్లు కొన్ని సూచనలు చేసి ల్యాండింగ్ గేర్‌ను సరిచేశారు. అయినా సమస్యను క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం విమానాన్ని గింపో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయమని కోరారు. గ్రౌండ్ కంట్రోల్ సూచనల మేరకు పైలట్ గింపో ఎయిర్‌పోర్టులో విమానాన్ని దించారు.
ఈ ఆపరేషన్‌లో ఎలాంటి అపాయం తలెత్తకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆదివారం ల్యాండింగ్ గేర్ సమస్యతో ప్రమాదానికి గురై 179 మంది మరణానికి కారణమైంది జెజూ ఎయిర్ ఫ్లైట్ కాగా.. ఇవాళ ల్యాండ్ గేర్ సమస్య తలెత్తింది కూడా జెజూ ఎయిర్ ఫ్లైట్‌లోనే కావడం గమనార్హం.