గాజా స్ట్రిప్: గాజాలోని నస్సీర్ దవాఖానపై సోమవారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు సహా 20 మంది చనిపోయారని పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు. మరణించిన జర్నలిస్టుల్లో రాయిటర్స్ కాంట్రాక్టర్, ఫొటొగ్రాఫర్ హతెమ్ ఖలెద్ ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు. మిగిలిన వారు అల్జజీరా, అసోసియేట్ ప్రెస్కు చెందినవారని పేర్కొన్నారు.
గాజాపై నియంత్రణ సాధించడానికి గత వారం ఇజ్రాయెల్ వేలాది మంది ప్రత్యేక సైనికులను మోహరించింది. అంతర్జాతీయ విజ్ఞప్తులు పట్టించుకోకుండా తన సైనిక ఉద్దేశాలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ సంప్రదింపులకు నెతన్యాహు అంతరాయం కలిగిస్తున్నారని హమాస్ ఆరోపించింది.