కోబ్రి: పశ్చిమ మాలిలోని కోబ్రి పట్టణంలో ఐదుగురు భారతీయులు గురువారం కిడ్నాప్‌నకు గురయ్యారు. ఓ విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న వీరిని సాయుధులైన దుండగులు తుపాకులతో బెదిరించి అపహరించినట్టు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగతా భారతీయులను సురక్షితంగా మాలి రాజధాని బమాకోకు తరలించారు.
కాగా, ఈ కిడ్నాప్ ఏ గ్రూప్ పని అనేది మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. మాలి ప్రస్తుతం సైనిక పాలనలో ఉంది. గత కొంతకాలంగా మాలిలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోయాయి.