వాషింగ్టన్: ఒక జీవి మీద దాడిచేసిన మరో జీవి దాన్ని మొత్తం తినేయడం సాధారణమే. అయితే, అమెరికాలో ఇటీవల గుర్తించిన ఓ పరాన్న జీవి కథ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. టెక్సాస్ స్టేట్ పార్క్లో ఓ పరాన్నజీవి బయటపడింది. అట్లాంటిక్ క్రోకర్ అనే ఓ జాతి చేప నోటిని పరిశీలించగా.. నాలుక ఉండాల్సిన స్థానంలో ఆ పరాన్న జీవి తిష్టవేసింది. ఆ చేప నాలుకను ఆ పరాన్న జీవే తినేసి.. అనంతరం ఆ చేప నోటిలో నాలుక మాదిరి అది అతుక్కుపోయినట్టు పరిశోధకులు తెలిపారు.