Israel – Iran | అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి
Israel - Iran | ఇజ్రాయెల్ (Israel) అన్నంత పనీ చేసింది. ఇరాన్ (Iran)పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి, అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది (Israel attacked).
Israel – Iran | ఇజ్రాయెల్ (Israel) అన్నంత పనీ చేసింది. ఇరాన్ (Iran)పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి, అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది (Israel attacked). శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు (US Officials) వెల్లడించారు. ఇరాన్లో (Iran) అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కూడా వెల్లడించింది.
ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. అయితే, మీడియా కథనాలను అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది (Iran activated its air defence system ).
గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది. సిరియాలోని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్‌పై వందల డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్
ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావించిన ఇరాన్ ఇటీవలే ప్రతీకార దాడికి దిగిన విషయం తెలిసిందే. గత శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. అయితే ‘బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ’ను ఉపయోగించి.. ఇరాన్ ప్రయోగించిన 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల్లో 99 శాతం కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఇరాన్ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఆర్మీ అధికార ప్రతినిధి డానియెల్ హగేరీ పేర్కొన్నారు. ఇరాన్ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు.
మొత్తంగా వీటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ భూభాగంపైకి వచ్చాయని, ఒక ఎయిర్ బేస్‌కు స్వల్ప నష్టం చేకూరిందని, అయితే అది ఇప్పటికీ పనిచేస్తుందని వెల్లడించారు. కాగా, తమ లక్ష్యాన్ని సాధించామని, ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మహ్మద్ హుస్సేన్ భగేరీ పేర్కొన్నారు. మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్ చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు దాడి నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సమయం వచ్చినప్పుడు ఇరాన్ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. చెప్పినట్టుగానే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో ప్రతీకార దాడి చేసింది.
Also Read..
Rahul Gandhi | ఓటు దేశభవిష్యత్తును నిర్ణయిస్తుంది : రాహుల్ గాంధీ
PM Modi | అధిక సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు మోదీ పిలుపు
Lok Sabha Elections | సార్వత్రిక సమరం.. కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

