మాస్కో: ఇటీవల మునిగిన రష్యా యుద్ధ నౌక, క్షిపణి క్రూయిజర్ మాస్కోవా చివరి ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నల్ల సముద్రంలో ఉన్న రష్యా ప్రతిష్ఠాత్మక యుద్ధ నౌకపై క్షిపణితో దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. కాగా, అగ్ని ప్రమాదం వల్ల అందులోని క్షిపణులు పేలడంతో ఈ యుద్ధ నౌక మునిగినట్లు రష్యా పేర్కొంది. అయితే మాస్కోవా మునగడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యాకు చెందిన ఒక టీవీ ఛానల్ సంచలన ప్రకటన చేసింది.
నాటి సోవియట్ రిపబ్లిక్లో భాగమైన ఉక్రెయిన్ మైకోలైవ్లోని షిప్‌యార్డ్‌లో తయారైన ఈ యుద్ధ నౌక స్లావాగా 1979 జూలైలో జలప్రవేశం చేసింది. రష్యా ఆవిర్భవించిన తర్వాత రాజధాని మాస్కో పేరును సూచించేలా మాస్కోవాగా దీనికి పేరు పెట్టారు. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇది కీలకంగా వ్యవహరించింది. జార్జియా, సిరియా, ఉక్రెయిన్ సంఘర్షణలో సేవలందించింది.
16 దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సమర్థ్యమున్న ఈ యుద్ధనౌక 611.5 అడుగుల (186 మీటర్లు) పొడవు ఉంటుంది. 62 మంది అధికారులతో పాటు 476 మంది సిబ్బందిని కలిగి సుమారు 40 ఏండ్ల పాటు సేవలందించిన రష్యా యుద్ధ నౌక మాస్కోవా ఈ నెల 15న ధ్వంసమై నల్ల సముద్రంలో మునిగిపోయింది.
WATCH: This is the Russian warship #Moskva shortly before it sank, per reports https://t.co/mKOynvpCEF#UkraineRussiaWar pic.twitter.com/nRqznPqkyd
— NDTV (@ndtv) April 18, 2022
#war Photo of the damaged cruiser Moskva in the Black Sea in 15 April 2022.⚠️
First impressions of this shocking photo. Life-saving equipment (rescue rafts) on board are missing, which means they were dropped into the water during the rescue operation./1 pic.twitter.com/WREeqmSvtA— Capt(N) (@Capt_Navy) April 17, 2022