అమెరికాలో మరో వైరస్.. 20 ఏండ్ల తర్వాత మంకీపాక్స్ కేసు

వాషింగ్టన్: అమెరికాలో మరో వైరస్ కలకలం రేపింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. టెక్సాస్‌కు చెందిన ఒక వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఆ దేశానికి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి అక్కడ మంకీపాక్స్ వైరస్ సోకి ఉంటుందని తెలిపింది. ఆ వ్యక్తి ప్రస్తుతం డల్లాస్‌లోని ఆసుపత్రిలో ఐసొలేషన్‌లో ఉన్నట్లు వివరించింది.
ఈ నెల 8,9 తేదీల్లో ఆ వ్యక్తి ప్రయాణించిన రెండు విమానాల్లో అతడితో కలిసి ఉన్న ఇతర ప్రయాణికులను ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఎయిర్‌లైన్స్, స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక వ్యక్తికే మంకీపాక్స్ సోకినందున సాధారణ ప్రజలకు ఎలాంటి వ్యాప్తి ముప్పులేదని తెలిపింది. 2003లో అమెరికాలో 47 మందికి మంకీపాక్స్ సోకినట్లు వెల్లడించింది. ఇరవై ఏండ్లలో ఇదే తొలి కేసు అని సీడీఎస్ పేర్కొంది.
కాగా, మంకీపాక్స్ కూడా స్మాల్‌పాక్స్ (మశూచి) జాతికి చెందిన వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వైరల్ అనారోగ్యం ఇది. మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా ఎలుకలు, జంతువులలో మనుగడ సాగిస్తుంది. అయితే కొన్నిసార్లు జంతువుల నుంచి మానవులకు ఇది వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ సోకిన వారిలో తేలికపాటి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. జలుబు, లింఫ్ నాడుల్లో వాపు, ముఖం-శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ అంటువ్యాధి రెండు నుంచి నాలుగు వారాలపాటు ఉంటుంది. శ్వాసకోశ బిందువుల ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఇది వ్యాపిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

