Israel | టెల్ అవీవ్ : ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, నేటికీ దానిని ఉల్లంఘిస్తూ డ్రోన్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇరాక్ వైపు నుంచి రెండు డ్రోన్లు తమ దేశంలోకి దూసుకొచ్చాయని, వాటిని కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. వాటిని ఇరాక్ ప్రయోగించిందని చెప్పడానికి గుర్తు అవి తూర్పు వైపు నుంచి రావడమేనని చెప్పింది. మధ్యధరా సముద్రంలోని నావికాదళం పడవ సాయంతో వాటిని కూల్చేసినట్లు వివరించింది.