ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వెహికిల్స్ హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అందరూ వీటివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. కాగా, త్వరలో సౌరశక్తితో నడిచే ఈవీ కారును మార్కెట్లోకి తీసుకొస్తామని జర్మన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్స్ తయారీ సంస్థ సోనో మోటార్స్ వెల్లడించింది. ఈ కారుకు ‘సియోన్’ అని పేరు పెట్టింది. సియోన్ బ్యాటరీ ఒక్కో చార్జింగ్కు దాదాపు 300 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది.
ఇటీవలే జర్మన్ స్టార్టప్ సోనో మోటార్స్ తన సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం ‘సియోన్’ అనే ఫైనల్ సిరీస్ ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది.
సోనో మోటార్స్ 2023 నుంచి ఏడేళ్లలో 2.5 లక్షల యూనిట్ల ‘సియోన్’ వాహనాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈ సోలార్ ఈవీ కారుకు ఐదు డోర్లుంటాయి. 456 సోలార్ ప్యానెల్స్‌ను ఇందులో అమర్చారు. ఇది వాహనానికి ఒక వారం పాటు దాదాపు 112 కి.మీల అదనపు రేంజ్‌ను అందిస్తుంది. బ్యాటరీ ఒక్కో చార్జ్‌కు దాదాపు 300 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
‘సియోన్’ కోసం ఇప్పటికే సోనో మోటార్స్ 19,000 రిజర్వేషన్లను పొందింది. ఈ ఈవీ కారును వ్యక్తిగత కొనుగోలుదారులతో పాటు ఫ్లీట్ ఆపరేటర్లను కూడా అందించాలని యోచిస్తోంది. ‘సియోన్’ ధర సుమారు $25,000 (రూ.20 లక్షలు) ఉండొచ్చని అంచనా.