Fire @ Jeddah Oil Depot | జెడ్డా ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం.. హుతిల పనేనా?!
Fire @ Jeddah Oil Depot | సౌదీ అరేబియా జెడ్డా సిటీలో ఆయిల్ డిపోలో మంటలు చెలరేగాయి. హుతి తిరుగుబాటుదారుల పనేనని అనుమానిస్తున్నారు.
Fire @ Jeddah Oil Depot | సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలోని ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎఫ్1 రేస్ ప్రారంభం కానుండగా జెడ్డాలోని ఆయిల్ డిపోలో శుక్రవారం మంటలు చెలరేగడం ఆందోళనకరమని చెబుతున్నారు. మంటలు, భారీ పొగతో కూడిన దృశ్యాల వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదానికి అసలు కారణాలు తెలియ రాలేదు. అయితే హుతి తిరుగుబాటుదారులే ఈ ఆయిల్ డిపోపై పాల్పడి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.
ఈ ఘటనపై సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ గానీ, అధికారిక మీడియా గానీ స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం జెడ్డాలోని ఓ ఆయిల్ డిపోలో ఇటువంటి దాడి జరగడం గమనార్హం.
యెమెన్ హుతి తిరుగుబాటుదారులు నడుపుతున్న ఆల్-మాసిరాహ్ శాటిలైట్ న్యూస్ చానెల్లో తిరుగుబాటు దారులు తమ దాడులకు సంబంధించిన వివరాలను తర్వాత విడుదల చేస్తామని ప్రకటించారు. జెడ్డా అగ్ని ప్రమాదం వెనుక తామే ఉన్నామని మాత్రం హుతి తిరుగుబాటుదారులు ప్రకటించుకోలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- fire
- Jeddah
- Oil Depot
- saudi arabia
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

