బీలమ్ : బ్రెజిల్‌లోని బీలమ్ సిటీలో జరుగుతున్న యూఎన్ కాప్30(UN COP30) సదస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ప్రతినిధులు సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ పెవిలియన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించడంతో సమీపంలో ఉన్న డెలిగేట్స్ ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. సదస్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్లో ఈ ఘటన జరిగింది. మంటలు దట్టంగా వ్యాపించడంతో అన్ని ఎగ్జిట్ గేట్ల నుంచి జనం పరుగులు తీవారు. సుమారు ఆరు గంటల వ్యవధి తర్వాత మళ్లీ స్టాల్స్‌ను ఓపెన్ చేశారు. 21 మందికి చికిత్స అందించినట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది. పొగ పీల్చడం వల్ల 19 మంది అస్వస్థులయ్యారు. కానీ ఎవరికీ కాలిన గాయాలు కాలేదు.
❗️⚠️🇧🇷 – BREAKING: Fire Breaks Out in Pavilion at COP30 Climate Conference in Belém, Brazil
A fire was reported on Thursday, November 20, in one of the pavilions hosting the COP30 UN Climate Change Conference in Belém, Pará, Brazil. Security personnel ordered the immediate… pic.twitter.com/qZB7zvtzwz
— 🔥🗞The Informant (@theinformant_x) November 20, 2025
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అక్కడే ఉన్నారు. ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నారు. మంత్రి భూపేందర్‌తో పాటు భారత ప్రతినిధుల బృందం సురక్షిత ప్రాంతానికి వెళ్లింది. భారత బృందం సురక్షితంగా ఉన్నట్లు మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
In an unfortunate event, a fire broke out at the UNFCCC CoP30 venue, in Belém, Brazil.
Everyone at the venue is reported safe. Members of the Indian delegation, and media persons have also been evacuated safely.
— Bhupender Yadav (@byadavbjp) November 20, 2025