న్యూఢిల్లీ: అత్యంత సంతోషకర దేశాల్లో ఫిన్లాండ్(Finland) మళ్లీ రికార్డు క్రియేట్ చేసింది. హ్యాపియెస్ట్ కంట్రీ ర్యాంకుల్లో ఫిన్లాండ్ 8వ సారి టాప్‌లో నిలిచింది. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు 2025ని గురువారం రిలీజ్ చేశారు. ఆ రిపోర్టు ప్రకారం ఈ యేడాది కూడా ఫిన్లాండే ఆనందకర దేశ జాబితాలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన వెల్బీయింగ్ రీసర్చ్ సెంటర్ .. హ్యాపినెస్ ర్యాంకింగ్‌ను తయారు చేస్తుంది. దాంట్లో ఈసారి కూడా నార్డిక్ దేశాలకు హ్యాపియెస్ట్ ర్యాంకుల్లో టాప్‌లో నిలిచాయి. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ దేశాలు వరుసగా టాప్‌లో నిలిచాయి.
తమ జీవితాల గురించి ప్రశ్నలు వేసిన సమయంలో వాళ్లు ఇచ్చే సమాధానాల ఆధారంగా హ్యాపినెస్ ర్యాంకింగ్‌ను ఇస్తారు. అనలిటిక్స్ సంస్థ గ్యాలప్, యూఎన్ సస్టేనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ .. సంయుక్తంగా ఈ స్టడీ చేపట్టాయి. సంతోషం అంటే కేవలం సంపద, అభివృద్ధి కాదు అని, అది ఓ నమ్మకం, కలయిక, నీ వెంట ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవడం అని గ్యాలప్ సంస్థ సీఈవో జాన్ క్లిఫ్టన్ తెలిపారు. బలమైన సమాజం, ఆర్థిక వ్యవస్థలు కావాలంటే, ఒకరికి ఒకరు అవసరమైన వాటిల్లో పెట్టుబడి పెట్టాలన్నారు.
— World Happiness Report (@HappinessRpt) March 20, 2025