Doctor Oumair Aejaz | వాషింగ్టన్, ఆగస్టు 21: అమెరికాలో ఉంటున్న భారత్కు చెందిన 40 ఏండ్ల డాక్టర్ లైంగిక అకృత్యాలు బయటపడటంతో అతడిని పోలీసులు అరెస్టుచేశారు. గత కొన్నేండ్లుగా వందలాది మహిళలు, చిన్నారుల నగ్న చిత్రాలు, వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు. భార్య ఫిర్యాదుతో అతడిని అక్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ వర్క్ వీసాపై 2011లో అమెరికా వెళ్లాడు. పలు దవాఖానలు, వైద్య సంస్థలలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
తన దవాఖానకి వచ్చే పేషంట్ల చిత్రాలు, వీడియోలు తీయడానికి ఈ డాక్టర్ హాస్పిటల్ గదులలో, బట్టలు మార్చుకునే గదుల్లో, బాత్రూమ్ల్లో రహస్య కెమెరాలు అమర్చాడు. తన ఇంట్లో సైతం వీటిని ఏర్పాటు చేశాడు. ఆఖరికి రెండు ఏండ్ల పిల్లల నగ్న చిత్రాలను కూడా రికార్డు చేసినట్టు ఆక్లాండ్ కౌంటీ పోలీసులు చెప్పారు. అతడి నివాసం, హాస్పిటల్, ఇతర ప్రదేశాలలో తనిఖీలు చేపట్టి కంప్యూటర్లు, ఫోన్లు, 15 ఎక్స్టెర్నల్ డివైజ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక హార్డ్ డ్రైవ్లోనే 13 వేల అభ్యంతరకర వీడియోలు ఉన్నాయి.