Bangladesh | ఢాకా: త్వరలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించనుండడంతో బంగ్లాదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కొత్తగా ఏర్పడనున్న విద్యార్థుల రాజకీయ పార్టీతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తమ విజయావకాశాలు దెబ్బ తింటాయేమోనని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) కలవరపడుతోంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానిషేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి కారణమైన విద్యార్థి ఉద్యమానికి సారథ్యం వహించిన యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్ మూవ్మెంట్ ఫిబ్రవరిలో కొత్త రాజకీయ పార్టీగా మారనుంది.