న్యూయార్క్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్ఐవీ వైరస్‌పై చిరకాల పోరాటం ఫలించింది. దశాబ్దాలుగా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఒక మైలురాయిగా నిలుస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చే హెచ్ఐవీ టీకాను అమెరికా ఆమోదించింది.
కనీసం 35 కేజీల బరువున్న పెద్దలు, కౌమార దశలో ఉన్న వారికి ప్రెప్ ఇంజక్షన్‌గా ఉపయోగించడానికి ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చింది.