అమెరికాలో భారత రెస్టారెంట్ ధ్వంసం.. రంగంలోకి ఎఫ్‌బీఐ

వాషింగ్టన్: అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర రాజధాని శాంటా ఫీ నగరంలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్‌పై గత ఏడాది దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఇండియా ప్యాలెస్ హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. గుర్తు తెలియనివాళ్లు గత ఏడాది జూన్‌లో.. హోటల్లోకి ప్రవేశించి.. కిచెన్, డైనింగ్ రూమ్, స్టోరేజ్ ఏరియాను ధ్వంసం చేశారు. ట్రంప్ 2020 అంటూ ఆ హోటల్ గోడలపై పెయింటింగ్ కూడా వేశారు. ఆ హోటల్ ఓనర్ సిక్కు మతస్తుడు. ఆ దాడి వల్ల సుమారు లక్ష డాలర్ల మేర అతనికి నష్టం వచ్చింది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. రెస్టారెంట్‌పై దాడి ఘటనను విద్వేష ఘటనగా చూపిస్తు శాంటా ఫీ పోలీసులు కేసు బుక్ చేశారు. భారతీయ వర్గంపై దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2013లో బల్జీత్ సింగ్ అనే భారతీయ సిక్కు ఆ రెస్టారెంట్‌ను కొన్నారు. దాన్ని ఆయన కుమారుడు బల్జోత్ నడిపిస్తున్నారు. దాడి జరిగి 16 నెలలు గడుస్తున్నా..ఇంకా ఆ కేసులో ఎటువంటి ఛార్జిషీట్ లేదు. దీంతో ఈ కేసును ఎఫ్‌బీఐకి అప్పగించారు. ఇండియా ప్యాలెస్ రెస్టారెంట్‌పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని గత వారం ఎఫ్‌బీఐ ఓ ప్రకటనలో చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

